TG: RTC బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ BRS పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఈనెల 9న ‘చలో బస్ భవన్’ కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావు, సబితా, తలసాని వంటి నేతలు వేర్వేరు ప్రాంతాల నుంచి బస్ భవన్కు చేరుకుని, ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ RTC ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు.