BHNG: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన మనోభావాలను కించపరిచి నందుకు కేసు నమోదు చేయాలని భువనగిరి పోలీస్ స్టేషన్ల్ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ అతహర్, షరీఫ్, ఇబ్రహీం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలన్నారు.