VSP: విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమీషనరేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.