కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్తో కలిసి జీవనోపాధుల మెరుగుదలపై కలెక్టర్ బాలాజీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పరిశ్రమల, మత్స్య పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో జీవనోపాధుల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి అంశాల గురించి ఆరా తీశారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.