KNR: కరీంనగర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్, ప్రైవేట్ వ్యక్తి రాములు 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు.