SKLM: కవిటి మండలం మాణిక్యపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సాఫ్ట్ బాల్, త్రో బాల్ రాష్ట్రస్థాయి క్రీడలకు 28 మంది ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వైకుంఠ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరిని ఎంఈఓ ధనుంజయ్ మజ్జి అభినందనలు తెలియజేస్తూ క్రీడాకారులు మరింతగా రాణించి జాతీయస్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.