భారత మాజీ ప్రధాని దేవేగౌడ ఆసుపత్రిలో చేరారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. మాజీ ప్రధానికి పరీక్షలు చేసిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, దేశానికి 11వ ప్రధాని దేవేగౌడ పని చేశారు.