TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై వివేక్ స్పందించారు. అడ్లూరి విమర్శలకు గల కారణం తనకు తెలియదని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో మీటింగ్ ఉన్నందునే ఆ రోజు మధ్యలో వెళ్లాల్సి వచ్చిందని వివేక్ చెప్పారు. ఆ విషయాన్ని పక్కనున్న మంత్రులకు కూడా చెప్పానన్నారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.