NZB: పట్టణ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సుల్లో అందిస్తున్న శిక్షణకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని మహిళా ప్రాంగణం జిల్లా అధికారి ఇందిర కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల నర్సింగ్ నెలరోజుల టైలరింగ్, బ్యూటిషన్లో శిక్షణకు ఈనెల 16లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.