E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి మంగళవారం రాజమండ్రి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో మాట్లాడి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, సహనశీలత మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలని ఆమె తెలిపారు.