రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఇద్దరు దేశాదినేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అనంతరం ద్వైపాక్షిక అజెండాలో పురోగతిని సమీక్షించారు.