కోనసీమ: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె జగన్ను పుష్పగుచ్చం అందజేశారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేయాలని జగన్ దిశా నిర్దేశం చేశారని రాజేశ్వరి దేవి అన్నారు. ఈ సమావేశంలో తదితర నాయకులు పాల్గొన్నారు.