HYD: సమ్మక్క-సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం లోగోను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, భవన నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. మోదీ దార్శనికతతో ఈ వర్సిటీ ఏర్పడిందని, ఇది స్థానిక గిరిజన భాషలు, సంస్కృతి ఆధారంగా కోర్సులకు వేదిక కావాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆకాంక్షించారు.