NLG: హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేవరకొండ, మునుగోడు, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.