JGL: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్లో భాస్కర్ రెడ్డి ఫర్టిలైజర్స్ దుకాణాన్ని ఏవో రాజ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పురుగు మందుల రిజిస్టర్లు, కంపెనీ వివరాలను పరిశీలించి, దుకాణదారులు నిబంధనల ప్రకారం మాత్రమే మందులు విక్రయించాలని సూచించారు. రైతులు మోతాదుకు మించి మందులు ఉపయోగించకుండా ఉండాలని తెలిపారు.