SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు మరో గేటు ఎత్తి, 4 గేట్ల ద్వారా 27,761 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 29,097 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నీటిమట్టం 18.103 TMCలు నిల్వ ఉందని పేర్కొన్నారు.