NDL: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పి. మర్రిస్వామి డిమాండ్ చేశారు. నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అనంతరం MRO శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 6400 కోట్లు ఉంటే రూ. 400 కోట్లు విడుదల చేశారన్నారు.