AP: తన సోదరుడు, చంద్రగిరి మాజీ MLA దివంగత నారా రామ్మూర్తినాయుడు వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నారావారిపల్లెలోని స్వగృహానికి వెళ్లిన ఆయన కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు. అనంతరం రామ్మూర్తినాయుడు ఘాట్ వద్ద నివాళులర్పించి స్మృతి వనం ప్రారంభించారు. స్మృతి వనం నుంచి తిరిగి వెళ్తూ మార్గ మధ్యలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.