GNTR: తుళ్లూరు, నార్త్ పోలీస్ సబ్ డివిజన్లలో భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు నివసించే ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల చెలామణిని అరికట్టడానికి నిఘా పెంచాలన్నారు.