ADB: స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం తాంసి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. క్రమం తప్పకుండా రౌడీ షీటర్లను, హిస్టరీ షీటర్లను తనిఖీ చేయాలని అన్నారు. ఎస్పీతో పాటు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.