NLR: తోటపల్లి గూడూరు మండలంలోని పోట్లపూడి గ్రామంలో ఇవాళ పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ రమణి మాట్లాడుతూ.. ఓకల్ ఫర్ లోకల్ గురించి వివరించారు. మనకు స్థానికంగా దొరికే ఆకుకూరలు, మునగాకు, చిరుధాన్యాలు తినాలని సూచించారు. గర్భవతులు బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు.