ATP: పామిడి మండలం సొరకాయల పేట గ్రామంలో పండ్ల తోటలను ఇవాళ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీం బాషా పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఉపాధి శ్రామికులకు ఈ కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఉపాధి పనుల వద్ద ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తేజ్యోష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.