TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సీఈఓ సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల సంస్కరణలు, కొత్త మార్పుల గురించి ఆయన పార్టీలకు వివరించారు. ఈసారి EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని సీఈఓ తెలిపారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని రాజకీయ పార్టీలకు సుదర్శన్ రెడ్డి సూచించారు.