ADB: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రెవెన్యు సదస్సులో భాగంగా మంగళవారం భూభారతి పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహిసిల్దార్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిష్కారానికి చేపట్టవలసిన సూచనలు, సలహాలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, తదితరులు ఉన్నారు.