AP: కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారినికి కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుకి పవన్ ధన్యవాదాలు తెలిపారు.