KRNL: వాల్మీకి భవన్ నిర్మాణం కోసం తన తరుఫున రూ.1 కోటి సహకారం అందిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. జిల్లాలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఈ విరాళం ప్రకటించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ తమ నాయకుడు సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి చెప్పారు.