MBNR: 42% బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కు అని మాజీ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయవివాదాలు పరిష్కారం” అంశంపై బీసీ సంఘాల సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యావంతులు బీసీ సంఘాల నాయకులు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.