W.G: రామాయణ మహా కావ్యాన్ని రచించి మానవాళికి అందించి సన్మార్గాన్ని నిర్దేశించిన ఆదర్శ ప్రాయుడు మహర్షి వాల్మీకి అని కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.