AP: అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై ప్రభుత్వం వేటు వేసింది. కల్తీ మద్యం తయారవుతున్నా పసిగట్టలేని కారణంగా ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిశోర్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.