అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్లో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శమని, రామాయణం ప్రతి శ్లోకంలో జీవన సందేశం నిండి ఉందని ఆయన అన్నారు.