VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమైంది. పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమానును అధిరోహించారు. పాలధార, తెల్ల ఏనుగు, జాలరి వల, అంజలి రథం ముందు నడవగా, పురవీధుల్లో అమ్మవారు ఊరేగుతున్నారు. పైడిమాంబతో ప్రతిరూపంగా భక్తులను పూజారి వెంకటరావు ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.