E.G: గోకవరం డ్రైవర్స్ కాలనీలో దసరా మహోత్సవాలు పురస్కరించుకొని మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ కమిటీ సభ్యులకు రూ. 2 లక్షల 50 వేల విరాళం ప్రకటించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 1 లక్ష చెక్కును శ్రీనివాసరావు అందజేసారు.