GDWL: ఐజ మండలం తుప్పత్రాల గ్రామంలో గత నాలుగు రోజులుగా రేబిస్ వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఒక ఆవును మంగళవారం పశు వైద్య సిబ్బంది పరీక్షించారు. పశువుల డాక్టర్ మల్లేశ్, వెటర్నరీ అసిస్టెంట్ రోనాల్డ్ గ్రామాన్ని సందర్శించి ఆవు నుంచి శాంపిల్స్‌ను సేకరించి, పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు పంపించారు.