HYD: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య రావు, సామల హేమ మర్యాద పూర్వకంగా కలిశారు. మాగంటి గోపీనాథ్‌తో తమకున్న అనుభవాలను, జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ.. రాబోయే ఉపఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.