KRNL: కర్నూలులో జరిగిన ఎసీఎఫ్ అండర్-14, 17 ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి గార్గేయపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవంబర్ 21 నుంచి 23 వరకు నూజివీడులో జరగనున్న 69వ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు గురువారం ఎంపికయ్యారు. నాసిర్ బేగ్, భువనేశ్వరి ప్రతిభ చూపారని హెచ్ఎం వెంకటరాముడు తెలిపారు. ఉపాధ్యాయులు రాజశేఖర్, పాల్ విజయ్ కుమార్ వారిని అభినందించారు.