విశాఖ: మధురవాడ కార్ షెడ్, మధురవాడ, కొమ్మాది, మారికవలస ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు స్టాప్ల వద్ద ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. పలు ఫిర్యాదులు చేసినా చర్యలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు స్టాప్‌లలో ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.