ప్రకాశం: యర్రగొండపాలెం మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మిల్లంపల్లి టోల్ ప్లాజా సమీపంలో జామాయిల్ తోట వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ఉన్న వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. పెద్దారవీడు మండలానికి చెందిన కొందరు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.