నారాయణపేట మండలం అప్పక్‌పల్లి, కోటకొండ మధ్య రహదారిని మొక్కలు నాటే సాకుతో ధ్వంసం చేస్తున్నారని సీపీఎం ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నేతలు వెంకట్రాములు మంగళవారం ఆరోపించారు. జేసీబీతో గుంతలు తవ్వుతుండటం వల్లే రోడ్డు పాడవుతోందని వారు తెలిపారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు చెప్పగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని నేతలు విమర్శించారు.