AKP: పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనకాపల్లి టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇళ్లు లేని పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.