NZB: కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి మంగళవారం బీజేపీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ పాలన పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.