KMM: ఎస్ఎఫ్ఐ ఖమ్మం నగర ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం సుందరయ్య భవనంలో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ప్రవీణ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాలలో పని చేస్తున్న పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ టీచర్లు 4 నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. వారికి తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.