AP: గుంటూరులోని ఏటుకూరులో దారుణ ఘటన చోటుచేసకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని కుర్రా గణేశ్ అనే యువకుడిని యువతి సోదరుడు కత్తులతో పొడిచి చంపాడు. యువతి సోదరుడితోపాటు మరో ఇద్దరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అప్పట్లో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడినా.. చంపారని గణేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.