కోనసీమ: ఐ పోలవరం మండలం కేశనకుర్రు పీహెచ్సీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో జిల్లా అధ్యక్షులు జి. దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ..వర్కర్లకు అర కోర వేతనాలు ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలపని ఆయన తెలిపారు.