SS: ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాలకు చెందిన 14మంది లబ్ధిదారులకు రూ. 9.05 లక్షల విలువైన CMRF చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.