CTR: చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తుషార్ డూడీని రాష్ట్ర TDP అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ కలిశారు. ఇందులో భాగంగా పలు సమస్యలను వినతిపత్రం రూపంలో అందించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 2019 నుండి 2024 మధ్య నమోదైనటువంటి తప్పుడు కేసులు తక్షణం తొలగించాలని వాటిని పైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.