BHPL: రేగొండ పెద్దపల్లి గ్రామానికి చెందిన నవీండ్ల శంకర్ పక్షవాతంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన హోంగార్డు దాట్ల ఐలయ్య, శంకర్ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితులు ఆరోపించారు. శంకర్ కుటుంబం అడిగినా ఐలయ్య బెదిరిస్తున్నాడని వాపోయారు. సమస్య పై MLA గండ్ర స్పందించి హోంగార్డ్ పై చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరారు.