GNTR: ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామ కాల్వ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు ఫిరంగిపురం పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా మృతుడు కృష్ణా జిల్లాకు చెందినవాడిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అతని పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, గుర్తుపట్టిన వారు ఫిరంగిపురం పోలీసులను సంప్రదించాలన్నారు