KKD: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కాకినాడ బార్లో న్యాయవాదులు నిరసన చేపట్టారు. అనంతరం దాడికి పాల్పడిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.