BDK: కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబెడ్కర్ విగ్రహం ఎదుట బహుజన సంఘాల కన్వీనర్ తాండ్ర వెంకటేశ్వర్లు నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని వారు అన్నారు. చీఫ్ జస్టిస్ పై షూ విసిరిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇది చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి మాత్రమే కాదని భారతీయులపై దాడిగా తెలిపారు.