గుంటూరు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, స్టేషనరీ వస్తువులపై ఉన్న 12 శాతం పన్నును పూర్తిగా తొలగించడం వల్ల ప్రతి విద్యార్థికి సుమారు రూ. 960 వరకు పొదుపు అవుతుందని అధికారులు వివరించారు. ఈ సంస్కరణలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.